భారత్ సమాచార్, ఢిల్లీ ; దేశ వ్యాప్తంగా 2024 పార్లమెంటు ఎన్నికలకు, ఆంధ్రప్రదేశ్ తో పాటుగా అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలకు సీఈసీ ఎన్నికల నోటిఫికేషన్ ను విడుదల చేసింది. నేటి నుంచే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుందని భారత ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అధికారికంగా వెల్లడించారు.
మొత్తం ఏడు దశల్లో లోక్ సభ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల పక్రియ ఏప్రిల్ 19 న మొదలై జూన్ 04 న ఫలితాలు వెల్లడించటంతో ముగుస్తుంది.
…



