భారత్ సమాచార్, దిల్లీ ;
కొంతమంది వాహనదారులు ఫాస్టాగులను వాహనం విండ్‌షీల్డ్‌పై బిగించడం లేదు. ఈ తరహా వాహనదారుల కారణంగా టోల్ గేట్ల వద్ద చెల్లింపుల విషయంలో ఇబ్బందులు తలెత్తి, ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతోంది. ముఖ్యంగా రద్దీ సమయాల్లో దీని వలన భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఇలాంటి వాహనదారులను దారిలో పెట్టడమే లక్ష్యంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సరికొత్తగా సంపూర్ణ మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది.
ఉద్దేశపూర్వకంగా ఫాస్టాగ్‌ను బిగించని వాహనదారుల నుంచి రెట్టింపు టోల్ ఛార్జీలు వసూలు…



