భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: రేపు దేశవ్యాప్తంగా కౌంటింగ్‌ జరగనుంది. రేపు సాయంత్రం నాటికి పూర్తిస్థాయిలో ఫలితాలు వెలువడనున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల లెక్కింపు ఉత్కంఠ రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం జరిగిన హింసతో ఏపీవ్యాప్తంగా పెద్దఎత్తున కేంద్ర బలగాల మోహరించారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్భంధీగా చర్యలు చేపట్టారు. ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక స్ట్రైకింగ్‌ ఫోర్స్‌లు ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌ కేంద్రాల దగ్గర 144 సెక్షన్‌, పోలీస్‌ యాక్ట్‌ అమలు చేస్తున్నారు. అంతేకాకుండా.. సీఎం జగన్‌,…