భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో దారుణం జరిగింది. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన బాధితుడిని ఎస్సై గదిలోకి తీసుకువెళ్లి బూతులు తిడుతూ ఇతర సిబ్బందితో కలిసి రబ్బర్ బెల్ట్, కర్రలతో చితక బాదడంతో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, స్థానిక నాయకులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకుంది. సింగరేణి కాలనీలో నివాసముండే బొందిలి రాంసింగ్(55) పండ్ల వ్యాపారి. రెండునెలల క్రితం అతడి భార్య శకుంతల బాయితో ఇంటి పొరుగున ఉండే ఓ మహిళతో గొడవ జరిగింది. అదేరాత్రి రాంసింగ్ భార్య…
పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన వ్యక్తితో ఎస్సై..?





