భారత్ సమాచార్.నెట్, సూర్యాపేట జిల్లా: తుంగతుర్తి నియోజకవర్గంలో పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఉద్దేశించిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమానికి ఎమ్మెల్యే మందుల సామేలు శ్రీకారం చుట్టారు. శనివారం జాజిరెడ్డిగూడెం మండలం కోడూరు గ్రామంలో ఈ బృహత్తర కార్యక్రమానికి సంబంధించిన శంకుస్థాపనలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సామేలు మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని ధ్యేయంగా చేసుకొని పనిచేస్తుందని స్పష్టం చేశారు. పేదలు ఆత్మగౌరవంతో జీవించేందుకు ఇందిరమ్మ ఇళ్లు దోహదపడతాయని…





