భారత్ సమాచార్, మెదక్ జిల్లా: బాల్య వివాహాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శుక్రవారం శివ్వంపేటలో డబ్ల్యూడిసిడబ్ల్యూ (మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ) ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలన, పిల్లలు అభివృద్ధిపై అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాలు జరగకుండా గ్రామాలు, తండాల్లో ప్రజలకు అవగాహన కల్పించి బాల్యవివాహాలు జరగకుండా చూడాలన్నారు, బాల్య వివాహాలు జరిగితే అంగన్వాడీ, ఆశా, పంచాయతీ…