భారత్ సమాచార్, హైదరాబాద్ ;
తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు పోలింగ్ పూర్తి కావటంతో సాధారణ పరిపాలనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వచ్చే జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తి అవుతుంది. ఈ నేపథ్యంలో పునర్విభజనకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. పునర్విభజన చట్టంపై చర్చించడానికి ఈ నెల 18న తెలంగాణ కేబినేట్ సమావేశం నిర్వహించనున్నట్టు అధికారులు…





