భారత్ సమాచార్.నెట్, తమిళనాడు: ఇటీవల కాలంలో ప్రేమ జంటలు చేసే పిచ్చిపనులు ఇతరులకు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. రహదారులపై, హోటళ్లలో, విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ మితిమీరిన స్వేచ్ఛతో లవర్స్ చేసే పనులతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు ప్రమాదకర రీతిలో బైక్‌పై స్టంట్స్ చేస్తున్నారు. మరికొందరు విభిన్నంగా తమ ప్రేయసితో కలిసి సాహసోపేత చర్యలతో ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. ఇన్‌స్టా రీల్స్ కోసం రకరకాల విన్యాసాలు చేసి కటకటాలపాలవుతున్నారు.
పోలీసులు, అధికారులు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఎంత అవగాహన కల్పించినా, జరిమానాలు విధించినా, పక్కా నిబంధనలు…

