భార‌త్ సమాచార్ నెట్, నిజామాబాద్ జిల్లా : బోధన్ క్రెసెంట్ హై స్కూల్‌లో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి నిర్వహించిన ‘ఇన్‌ట్రా స్కూల్ మెగా క్విజ్’ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన పీడబ్ల్యూడీ డిప్యూటీ ఇంజనీర్ సి.రామ్ మోహన్ జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా లోకజ్ఞానం పట్ల విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. అడిగిన సంక్లిష్ట ప్రశ్నలకు విద్యార్థులు ఎంతో వేగంగా, చాకచక్యంగా సమాధానాలు ఇచ్చి…