భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని అన్నారం గ్రామంలోని పుల్లారెడ్డి ఫార్మసీ కళాశాలలో గురువారం ఓరియంటేషన్ డే కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, కొత్తగా చేరిన విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థులను స్వాగతిస్తూ, ఫార్మసీ విద్య ప్రాధాన్యత, భవిష్యత్ అవకాశాలు, నియమ నిబంధనల గురించి వివరించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గదర్శనం చేస్తూ, విద్యతో పాటు నైతిక విలువలను కూడా అలవరచుకోవాలని సూచించారు.
పుల్లారెడ్డి ఫార్మసీ కళాశాలలో ఘనంగా ఓరియంటేషన్ ప్రోగ్రాం





