భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: భారతదేశ ఆర్థిక రంగ చరిత్రలో అరుదైన ఘనత సాధించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ). మార్కెట్ విలువలో 100 బిలియన్ డాలర్లు, అంటే దాదాపు రూ.8.8 లక్షల కోట్ల మార్కును దాటి దేశంలోని అగ్రశ్రేణి కంపెనీల సరసన చోటు దక్కించుకుంది. ఈ స్థాయి మార్కెట్ కేపిటలైజేషన్ సాధించిన ఆరో భారత కంపెనీగా, అలాగే తొలి ప్రభుత్వ రంగ బ్యాంక్‌గా ఎస్‌బీఐ రికార్డు సృష్టించింది. గురువారం ఎస్‌బీఐ షేర్ ధర జీవితకాల గరిష్ఠం రూ.971.15 వద్దకు చేరుకోవడంతో ఈ ప్రతిష్టాత్మక…