భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తూప్రాన్ మండలం వెంకటాయపల్లి గ్రామంలో నూతనంగా ఎన్నికైన యువ సర్పంచ్ హరీష్ గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం స్వచ్ఛ వెంకటాయపల్లి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మండలంలోనే అతి చిన్న వయస్సు గల సర్పంచ్‌గా గుర్తింపు పొందిన హరీష్ గౌడ్ స్వయంగా చీపురు పట్టుకుని గ్రామ వీధులను శుభ్రం చేయడం ద్వారా ప్రజలకు సేవాభావంతో ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువత పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా పాల్గొని క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ…