భారత్ సమాచార్, మెదక్ జిల్లా: జిల్లాలో మొదటి విడత స్థానిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని, శత శాతం ఓటింగ్ లక్ష్యంగా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొదటి విడతలో 160 గ్రామ పంచాయతీలకు గాను 16 ఏకగ్రీవం అయ్యాయని, మిగిలిన 144 జీపీలకు 411 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారని కలెక్టర్ తెలిపారు. మొత్తం 1,292 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ప్రశాంత వాతావరణంలో ప్రజలు 100% ఓటింగ్‌లో పాల్గొనాలని…