HomeUncategorizedSSC లో 2006 స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు

SSC లో 2006 స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు

భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా ;

కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో స్టెనోగ్రాఫర్‌ పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి SSC దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా గ్రేడ్-సి, గ్రేడ్-డి స్టెనోగ్రాఫర్ పోస్టులు మొత్తంగా 2006 భర్తీ కానున్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ ssc.gov.in ను విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లే చేయటానికి ఆగస్టు 17 చివరి తేదీ. ఆగస్టు 27 నుంచి 28 వ తేదీ వరకు అప్లికేషన్ ను ఎడిట్‌ చేసే అవకాశం అభ్యర్థులకు ఉంటుంది.

* వయోపరిమితి

స్టెనోగ్రాఫర్ గ్రేడ్-సి పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థి వయసు కచ్చితంగా 18 నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలి. అంటే 1994 ఆగస్టు 2 నుంచి 2006 ఆగస్టు 1 మధ్య జన్మించిన వారు మాత్రమే అర్హులు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-డి పోస్ట్‌లకు అప్లై చేసుకోవాలంటే అభ్యర్థి వయసు 18 నుంచి 27 ఏళ్ల లోపు ఉండాలి. 1997 ఆగస్టు 2 నుంచి 2006 ఆగస్టు 1 మధ్య జన్మించినవారు అప్లై చేసుకోవచ్చు.

* ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్

గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి ఇంటర్ పాసైన అభ్యర్థులు SSC స్టెనోగ్రాఫర్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

* అప్లికేషన్ ఫీజు

జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్టీ, ఎస్సీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.

* సెలక్షన్ ప్రాసెస్

అభ్యర్థులకు ముందు ఆన్‌లైన్ రాత పరీక్ష, తర్వాత స్టెనో‌గ్రఫీలో స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ పరీక్షలు అక్టోబర్, నవంబర్‌లో జరుగుతాయి.

* ఎగ్జామ్ ప్యాట్రన్

ఆన్‌లైన్ ఎగ్జామ్ వ్యవధి రెండు గంటలు ఉంటుంది. హిందీ, ఇంగ్లిష్ ల్వాంగేజ్‌లో మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ మోడల్‌లో ఎగ్జామ్ ఉంటుంది. జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ సెక్షన్స్ ఉంటాయి. మొదటి రెండు సెక్షన్స్ నుంచి 50 చొప్పున ప్రశ్నలు, చివరి సెక్షన్ నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి. ఎగ్జామ్ మొత్తం 200 మార్కులకు జరుగుతుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. రెండో దశలో నిర్వహించే స్కిల్ టెస్ట్ షార్ట్ హ్యాండ్ మీద పెన్ అండ్ పేపర్ మోడ్‌లో నిర్వహిస్తారు.

మరికొన్ని వార్తా విశేషాలు…

భారత నౌకాదళంలో 741 ఉద్యోగాలు

RELATED ARTICLES

Most Popular

Recent Comments