భారత్ సమాచార్.నెట్, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి మండలంలో తీవ్ర విషాదం నెలకుంది. తన చావుకు తన భార్య, అత్తతోపాటుగా కరీంనగర్ మహిళ పోలిస్ స్టేషన్ సీఐ కారణమంటూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. గడ్డిమందు తాగి అత్మహత్యయత్నానికి పాల్పడగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
చొప్పదండికి చెందిన కడారి శ్రవణ్‌కుమార్ కరీంనగర్ పట్టణానికి చెందిన ఓ యువతితో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. కొన్నాళ్ల తర్వాత వీరి మధ్య మనస్ఫర్థలు రావడంతో శ్రవణ్ భార్య కరీంనగర్ మహిళా పోలీసు స్టేషన్లో గృహహింస,…

