భారత్ సమాచార్.నెట్, శ్రీకాకుళం: ఆమదాలవలస పట్టణంలో గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు యువకులతో పాటు ఒక మైనర్‌ను అరెస్టు చేసినట్లు సీఐ పి.సత్యనారాయణ బుధవారం తెలిపారు. అనంతరం వారి వద్ద నుంచి 21.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డు కండ్రపేట శ్మశాన వాటిక వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా నిందితులు పట్టుబడినట్లు చెప్పారు. వివరాలిలా.. కొత్త కండ్రపేటకి చెందిన కారుణ్య జగదీష్, టీజీఆర్ నగర్ కాలనీకి చెందిన సయ్యద్ తహీర్ బాబుతో పాటు ఒక మైనర్, ఒడిశాకు చెందిన నీలాంచల్ పట్నాయక్ వద్ద గంజాయిని కొనుగోలు చేసి రైలులో ఆమదాలవలసకు తీసుకువస్తూ విక్రయించేవారని పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నట్టు సీఐ చెప్పారు. మైనర్‌ను జువైనల్ హోమ్‌కు తరలిస్తామన్నారు. నిందితుల్లో కారుణ్య జగదీష్‌పై ఇప్పటికే తొమ్మిది కేసులు, సయ్యద్ తహీర్‌పై రెండు దొంగతనాల కేసులు ఉన్నాయని పోలీసులు వివరించారు.
మరిన్ని కథనాలు