భారత్ సమాచార్.నెట్: జాతీయ స్థాయిలో తెలుగు చిత్రాలకు గుర్తింపు లభించింది. కేంద్రంలోని ప్రధాని మోదీ సర్కార్ ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది ప్రతిష్టాత్మక జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించింది. ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రాలకు, నటీనటులకు 71వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ విజేతల వివరాలను కేంద్రం వెల్లడించింది. సినిమా రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు గ్రహీతలకు అందజేయనున్నారు.
2023లో తెరకెక్కిన చిత్రాల్లో సాంస్కృతిక, వైవిధ్యం, సృజనాత్మకత అంశాల ప్రాముఖ్యత ఆధారంగా ఈ అవార్డులను ప్రకటించింది కేంద్రం. ఉత్తమ నటీనటులు, ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం వంటి అనేక విభాగాల్లో అవార్డులు ఖరారయ్యాయి. ఇందులో ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’కి అవార్డు వరించగా.. ‘హనుమాన్’ మూవీకి బెస్ట్ స్టంట్ కోరియోగ్రఫీకి నేషనల్ అవార్డు లభించింది. ఇక ‘బలగం’ మూవీలోని ఊరు పెల్లటూరు పాటకు అవార్డు దక్కింది.
అలాగే బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా డైరెక్టర్ సుకుమార్ కూతురు ‘శుకృతివేణి’ (గాంధీ తాతా చేటు) ఎంపికైంది. బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్‌గా బేబీ సినిమాకుగాను సాయి రాజేష్‌కు అవార్డు దక్కింది. అదేవిధంగా బెస్ట్ మేల్ సింగర్‌గా పీవీఎన్ఎస్ రోహిత్.. ప్రేమిస్తున్నా పాటకు వార్డు వరించింది. 71జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమాలు సత్తా చాటడంతో అభిమానులు, చిత్ర పరిశ్రమ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.