Homebreaking updates newsDonald Trump: ఇజ్రాయెల్‌కు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

Donald Trump: ఇజ్రాయెల్‌కు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

భారత్ సమాచార్.నెట్: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. కాల్పుల విరమణ కుదిరినప్పటికీ ఇరుదేశాలు దాడులు చేసుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు దేశాలు కాల్పుల ఒప్పందాన్ని బ్రేక్ చేశాయని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే మిత్ర దేశమైన ఇజ్రాయెల్‌కు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. కాగా, ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం మొదలైనప్పటి నుంచి తొలిసారిగా ట్రంప్ ఇజ్రాయెల్‌కు ఇలాంటి వార్నింగ్ ఇచ్చారు.
ఇరాన్‌పై బాంబు దాడులు చేయకూడదని ఇజ్రాయెల్‌ను హెచ్చరించారు. తక్షణమే పైలట్లను వెనక్కి రప్పించాలని ఇజ్రాయెల్‌కు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు ‘ఇజ్రాయెల్ ఆ బాంబులను వేయొద్దు. అలా చేస్తే అది తీవ్ర ఉల్లంఘనే. మీ పైలట్లను వెంటనే వెనక్కి రప్పించండి అంటూ ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్‌ ఇప్పటికీ శాంతికి కట్టుబడి ఉందని.. వాళ్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారని ట్రంప్ అన్నారు. ఇజ్రాయెల్ కూడా సీజ్‌ఫైర్ బ్రేక్ చేసింది. ఒక రాకెట్‌ను ప్రయోగించారు, కానీ అది లక్ష్యాన్ని చేరుకోలేకపోయిందని చెప్పారు.
ఇరు దేశాల మధ్య కాల్పుల ఒప్పందం కుదిరాక ఇలా దాడులు చేసుకోవడం సరికాదన్నారు ట్రంప్. ఇది సంయమనం పాటించాల్సిన సమయం అని.. ఇరు దేశాల చర్యల పట్ల తాను సంతోషంగా లేనని ట్రంప్ పేర్కొన్నారు. కాగా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం జరిగినట్లు ట్రంపే స్వయంగా ప్రకటించారు. ఈ ఒప్పందం జరిగిన కొద్దిసేపటికే దీనికి బ్రేక్‌ పడింది. ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి తమపై దాడులు చేసిందని ఇజ్రాయెల్ ఆరోపించింది.  ఈ దాడులకు తాము కూడా గట్టిగా బదులిస్తామని ప్రకటించడంతో ట్రంప్ ఈ విధంగా స్పందించారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments