August 7, 2025 8:19 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

RBI-Trump: ట్రంప్ డెడ్ ఎకనామీ వ్యాఖ్యలు.. ఆర్బీఐ కౌంటర్

భారత్ సమాచార్.నెట్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. భారత్ డెడ్ ఎకానమీ అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తిప్పికొట్టారు. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని.. ప్రపంచ ఆర్థిక వృద్ధికి అమెరికాతో పోలిస్తే భారతే ఎక్కువ దోహదపడుతోందన్నారు.

 

అమెరికా కేవలం 11 శాతం దోహదపడుతుంటే.. భారత్ 18 శాతం కంట్రిబ్యూషన్ ఇస్తుందన్నారు సంజయ్ మల్హోత్రా. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రకారం.. గ్లోబల్ ఎకానమీ వృద్ధి 3 శాతం ఉంటే.. భారత్ వృద్ధి 6 శాతం కన్న ఎక్కువగా ఉందని పేర్కొన్నారు సంజయ్ మల్హోత్రా. భారత్ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని.. భవిష్యత్తులో మరింత పురోగతి సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు.

 

భారత్‌పై అమెరికా టారిఫ్‌ల ప్రభావంపై కూడా ఆయన స్పందించారు. అమెరికా విధించిన సుంకాల ప్రభావం ప్రస్తుతం అంచనా వేయలేమని.. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. భారత్ జీడీపీ వృద్ధిపై ఆ ప్రభావం పడే ఛాన్స్ ఉందన్నారు. భారత్‌ కూడా అమెరికాపై ప్రతీకార సుంకాలు విధిస్తే.. మన ఆర్థిక వ్యవస్థపై అంతగా ప్రభావం ఉండదన్నారు.

Share This Post