భారత్ సమాచార్.నెట్, మెదక్: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శివ్వంపేట మండలం చిన్న గొట్టిముక్ల గ్రామం వద్ద నర్సాపూర్-తూప్రాన్ జాతీయ రహదారిపై కారు చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. శివ్వంపేట ఎస్సై మధుకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శివ్వంపేట గ్రామానికి చెందిన కొడకంచి బాలమణి (70), నర్సాపూర్ మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన కారు డ్రైవర్ ఉప్పలపు ఆంజనేయులు (35) శివంపేట నుంచి నర్సాపూర్ కు వెళ్తుండగా నర్సాపూర్-తూప్రాన్ 161 జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. సీటు బెల్టు పెట్టుకోకపోవడం, ఎయిర్ బెలూన్ తెరుచుకోకపోవడంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి శవపరీక్షకు తరలించినట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
మరిన్ని కథనాలు