భారత్ సమాచార్.నెట్, మెదక్: జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కంటికి రెప్పలా చూసుకోవలసిన తండ్రే కూతురిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అల్లాదుర్గం మండలంలోని ఒక గ్రామంలో కన్న కూతురిపైనే తండ్రి లైంగిక దాడికి పాల్పడిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పదేళ్ల బాలికపై తండ్రి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. గతంలో కూడా తండ్రి బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు. బాలికకు కౌన్సెలింగ్ ఇప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మరిన్ని కథనాలు