Homemain slidesకారు కన్నా ఖరీదైన పేడ పురుగు

కారు కన్నా ఖరీదైన పేడ పురుగు

భారత్ సమాచార్, అంతర్జాతీయం ;

చెడిందల్లా చైనా ష్యాషన్ అన్నట్టు… మనకు నచ్చింది మరొకరికి విచిత్రం… మనకి విచిత్రం అయినది వారికి స్టైల్ గా ఉంటుంది. పేడ పురుగుని మన దేశంలో ఎంతో చీప్ గా చూస్తాం కదా… కానీ అదే పేడ పురుగుని జపాన్ వంటి దేశాల ప్రజలు స్టాగ్ బీటిల్ అనే పేరుతో చాలా రిచ్ గా చూస్తున్నారు. పేడ పురుగు.. స్టాగ్ బీటిల్.. మనం పల్లెటూరిలో తరుచూ చూస్తాం. చిరాకు పడుతుంటాం. కానీ ఈ ఇన్సెక్ట్ అద్భుతంగా, ఆకర్షణీయంగా ఉందని ముచ్చట పడుతున్నారు కొన్ని దేశాల ప్రజలు. కాగా లండన్ బేస్డ్ నేచురల్ హిస్టరీ మ్యూజియం ప్రకారం… వెచ్చని వాతావరణంలో మాత్రమే వృద్ధి చెందే ఈ పురుగు.. తీపి ద్రవాలు, కలపను తింటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మూడు నుంచి ఏడు సంవత్సరాల వరకు వీటి జీవిత కాలం ఉంటుంది. ఈ పురుగులు పర్యావరణంలో ప్రత్యేక పాత్ర పోషిస్తాయి. తమ లైఫ్ సైకిల్ లో ఇవి 2-6 గ్రాముల బరువు ఉంటుండగా.. మగ కీటకం 35-75 మిమీ పొడవు, ఆడ కీటకం 30-50 మిమీ పొడవు ఉంటుంది. దీన్ని జపాన్ వంటి దేశాల్లో ప్రకృతి వైద్యులు ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తుంటారు.

ముఖ్యంగా జపాన్ లో ఈ పురుగు తమకు అదృష్టాన్ని తెచ్చి పెడుతుందని అక్కడ ప్రజల ప్రగాఢ నమ్మకం. ఆకస్మిక ధన లాభం కలుగుతుందని వారు గట్టిగా విశ్వసిస్తారు. కానీ ఆ ప్రాంతంలో ఇవి ఎక్కువగా కనిపించవు. కాబట్టి ఈ అరుదైన జాతికి డిమాండ్ అక్కడ బాగా డిమాండ్ పెరిగింది. లక్షలు పెట్టి మరీ వీటిని సొంతం చేసుకునేందుకు అక్కడ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రత్యేకంగా వీటిని పెంచి డబ్బులు సంపాదించేందుకు ప్లాన్ చేసారు వ్యాపారస్తులు. మొత్తానికి ఒక్క స్టాగ్ బీటిల్ ధర ప్రస్తుతం రూ.75 లక్షలకు పైమాటే. కాగా బీఎండబ్ల్యూ, ఆడి కారు కన్నా ఖరీదు అయినదిగా వర్ణిస్తున్నారు రచయితలు. అయితే దీన్ని అదృష్టానికి చిహ్నంగా సూచించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు ప్రస్తుతం లేవు.

మరికొన్ని ప్రత్యేక కథనాలు…

అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి ఆంధ్రా అల్లుడు

RELATED ARTICLES

Most Popular