భారత్ సమాచార్, తుని ;
ప్రశాంత గోదావరి జిల్లాలో మరో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. తుని మండలం తేటగుంట జాతీయరహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. గ్యాస్ ట్యాంకర్ ని గ్యాస్ సిలిండర్ల లారీ వెనుక నుంచి ఢీ కొంది. దీంతో టాంకర్ వాల్వ్ నుంచి హైడ్రోక్లోరిక్ యాసిడ్ బయటకు వస్తోంది. దీంతో ఒక్క సారిగా హైడ్రోక్లోరిక్ యాసిడ్ లీక్ తో సమీప ప్రాంతాలన్ని ఘాటు వాసనతో నిండిపోయాయి. ఈ యాసిడ్ ప్రభావంతో అక్కడ ఉన్న స్థానికులకు కళ్లలో మంటలు, వాంతులు అవుతున్నాయి. ఈ ప్రమాదం కారణంగా కిలో మీటర్ల మేర ట్రాఫిక్ కూడా జామ్ అయిపోయింది. దీంతో స్థానికులు, ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. స్థానికులు సమాచారం అందించటంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్ ను క్రమబద్దీకరించేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల వైపు ట్రాఫిక్ ను దారి మళ్లిస్తున్నారు. వైద్య సిబ్బంది అక్కడికి చేరుకొని పరిస్థితులను సమీక్షిస్తున్నారు.