July 28, 2025 11:58 am

Email : bharathsamachar123@gmail.com

BS

‘ఎవడే సుబ్రమణ్యం’ అన్వేషణ

భారత్ సమాచార్ ; నేచురల్ స్టార్ నాని, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన చిత్రం ‘ఎవడే సుబ్రమణ్యం’.ఈ మూవీ విడుదలై నేటికి 9 వసంతాలు. ఈ సందర్భంగా ఒక పోస్టర్ ను పంచుకుంది నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్. ప్రస్తుతం ప్రభాస్ తో‘కల్కి’ సినిమాని రూపొందిస్తున్న దర్శకుడు నాగ్ అశ్విన్ కి ఇది తొలి చిత్రం. ప్రముఖ నటుడు కృష్ణంరాజు, రీతు వర్మ ప్రత్యేక పాత్రలో మెరిశారు.

తనను తాను అన్వేషించుకునేందుకు ఓ కార్పొరేట్ ఉద్యోగి చేసే ప్రయాణమే ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమా. 2015 మార్చి 21 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఒక మోస్తరు విజయం సాధించటంతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఎవరెస్టు శిఖరంపై చిత్రీకరణ జరుపుకున్న తొలి తెలుగు చిత్రంగా చరిత్రకెక్కింది. నాగ్ అశ్విన్ కి ఉత్తమ నూతన దర్శకుడిగా అవార్డు లభించింది.

Share This Post
error: Content is protected !!