July 28, 2025 5:36 pm

Email : bharathsamachar123@gmail.com

BS

ఆంజనేయ బలం …

భారత్ సమాచార్, ఆధ్యాత్మికం ;

భువిపై అత్యంత బలవంతుడు ఆంజనేయ స్వామి. అయితే తన బలాన్ని తాను మర్చిపోతాడు. అది ఏమిటో, అలా ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆంజనేయ స్వామి బాల్య దశలో దేవతల వలన అనేక వరములు పొందాడు. పైగా రుద్రాంశ తో జన్మించాడు. బాల్యంలో మిక్కిలి అల్లరి చేసి ఋషుల ఆసనములు తీసుకొనిపోయి చెట్లు కొమ్మలకు వ్రేలాడదీసే వాడు. ఋషులు ధ్యానములో ఉండగా మెల్లగా వారిని సమీపముగా వెళ్లి విపరీతమైన అల్లరి చేసేవాడు. కానీ అతనిని ఎవరూ ఆపలేకపోయేవారు. అయితే అంజనాదేవి, కేసరి ఆంజనేయుడి అల్లరి ఆపలేక విచారంలోమునిగి పోయినారు. వారు తమకు తోచిన రీతిలో హనుమంతుని దారిలోకి తెచ్చుకునే ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నం ఫలించలేదు. అప్పుడు వారు మహర్షులను ఆశ్రయించి మహానుభావులారా మీరు దయ చూపవలెను, లేనిచో మా కుమారుడు బాగుపడడు అనిరి. అంత మహర్షులు దివ్య దృష్టితో యోచించి ఇతనికి తనబలంపై మహా గర్వం ఉన్నది. స్వశక్తిని మరిచిపోతే కానీ ఇతడు దారిలోకి రాజాలడు అని నిశ్చయించుకున్నారు. అవకాశమును పురస్కరించుకొని హనుమంతుని శపించుచూ నీవు నీ స్వబలమును మరిచిపోవుదువుగాక! ఎవరైనను ఎప్పుడు నీ బల పౌరుషము లను గురించి నీ స్మరణకు తెస్తారో, అప్పుడే నీవు నీ బలమును స్మరించుకుని శక్తిని సద్వినియోగం చేసుకునేదవు గాక! అనటంతో హనుమంతుడు తన బలమును తాను మరిచిపోయాడు. అందుకే ఎప్పుడైనా ఎవరైనా సరే ఆంజనేయస్వామి బలమును గుర్తు చేసిన వెంటనే మిక్కిలి బలవంతుడు అవుతాడు..జైశ్రీరామ్…

మరికొన్ని ప్రత్యేక కథనాలు...

పూలనే దేవుళ్లుగా కొలిచే పండుగ… బతుకమ్మ

 

Share This Post
error: Content is protected !!