August 7, 2025 8:01 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

అనుమానాస్పదంగా యువకుడు.. తీరా చూస్తే..?

భారత్ సమాచార్.నెట్, మేడ్చల్: దొంగనోట్లు కలకలం సృష్టించిన ఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అనుమానాస్పదంగా కన్పించిన ప్రత్తిపాటి ప్రేమచందు అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యువకుడి నుంచి రూ.15 లక్షల నకిలీ కరెన్సీ, రెడ్‌మీ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పూణేకు చెందిన రాకేష్ అతనికి ఈ దొంగనోట్లు సరఫరా చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి.. ప్రేమచందును రిమాండ్‌కు తరలించారు. ఈ దొంగనోట్ల వ్యవహారం ఇంకా పెద్ద నెట్‌వర్క్‌కు సంబంధించినదిగా భావించి దర్యాప్తును ముమ్మరం చేశారు. పోలీసులు ప్రజలకు అప్రమత్తంగా ఉండి, అనుమానాస్పద వ్యక్తులు లేదా లావాదేవీలను వెంటనే సమీప పోలీస్‌స్టేషన్‌కు తెలియజేయాలని సూచించారు.

Share This Post