August 8, 2025 3:19 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

దారుణం.. బాలికను నమ్మించి అత్యాచారం

భారత్ సమాచార్.నెట్, ఉత్తరప్రదేశ్: బాలికలపై అత్యాచారాలు, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న నిందితులకు ప్రభుత్వాలు ఎన్ని కఠిన శిక్షలు విధించిన వారిలో మార్పు రావడంలేదు. చట్టాలను ఎంత కఠినతరం చేసిన దేశంలో నిత్యం ఎక్కడో ఒక చోటు అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలోని భోజిపురా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో దారుణం జరిగింది. ఐదేళ్ల బాలిక తన 7 ఏళ్ల సోదరుడితో ఇంటి దగ్గర ఆడుకుంటోంది. గ్రామానికి చెందిన ఓ యువకుడు ముఖేష్(28) అక్కడికి వచ్చాడు. అతను దుకాణం నుంచి ఇద్దరు పిల్లలకు సోయా ప్యాకెట్లు కొని, ఆపై ఆమెకు మరికొన్ని వస్తువులు తెస్తానని చెప్పి తనతోపాటు ఆ బాలికను ఇంటికి తీసుకెళ్లాడు. నిందితుడు ఆమెపై అసహ్యకరమైన పనులు చేశాడు. బాలిక ఏడుపు శబ్దం విని అక్కడి నుంచి పారిపోయాడు.

నిందితుడికి గతంలోనే ఓ మహిళతో వివాహం:

ఏడుస్తున్న బాలిక ఆమె తల్లి షాక్ అయ్యింది. తల్లి అడగగా ముఖేష్ మామ చెల్లిని తన ఇంటికి తీసుకెళ్లాడని అమ్మాయి సోదరుడు చెప్పాడు. బాలిక పరిస్థితిని చూసి వెంటనే తన కుటుంబసభ్యులతో కలిసి భోజిపురా పోలీస్ స్టేషన్‌లో నిందితుడు ముఖేష్‌పై ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. బాలిక పరిస్థితిని చూసిన పోలీసులు వెంటనే ఆమెను వైద్య పరీక్షల కోసం జిల్లా మహిళా ఆసుపత్రికి పంపారు. బాలిక తల్లి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు నార్త్ ఎస్పీ ముఖేష్ చంద్రమిశ్రా తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ముఖేష్ కొన్ని సంవత్సరాల క్రితం బీహార్ కు చెందిన ఓ మహిళను వివాహం చేసుకున్నాడని, అతనికి ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నట్లు గ్రామస్థులు పోలీసులకు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముఖేష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని కథనాలు:

‘నిర్భయ’కంటే దారుణం..బాలికపై 10మంది అత్యాచారం

Share This Post