July 28, 2025 8:13 am

Email : bharathsamachar123@gmail.com

BS

Adivi Sesh-Mrunal: షూటింగ్ స్పాట్‌లో అడవి శేష్, మృణాల్ ఠాకూర్‌కు గాయాలు

భారత్ సమాచార్.నెట్: టాలీవుడ్ హీరో అడవి శేష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌ నటిస్తున్న చిత్రం ‘డెకాయిట్’. తాజాగా ‘డెకాయిట్’ మూవీ షూటింగ్‌లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. గాయాలైనప్పటికీ హీరో, హీరోయిన్ అది లెక్కచేయకుండా షూటింగ్‌ను పూర్తి చేసినట్లు సమాచారం. గాయాలైనా షూటింగ్ పూర్తి చేయడంతో.. వారి డెడికేషన్‌పై అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

షానిల్ డియో డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో లవ్‌, యాక్షన్‌కి ప్రాధాన్యతనిస్తూ కథను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. తాజా షెడ్యూల్‌లో ఓ కీలక యాక్షన్ సీన్ చిత్రీకరణ జరుగుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. డిసెంబర్ 25న ఈ మూవీని రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

 

ఇకపోతే హిట్ 2, మేజర్ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను చేస్తున్నాడు. గూఢచారి 2తో పాతు డెకాయిట్ సినిమా చేస్తున్నాడు అడివి శేష్. ఇక సీతారామంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్.. హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ చిత్రాలతో ఆడియన్స్‌కు దగ్గరైంది. ప్రస్తుతం తెలుగుతో పాటు బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో మృణాల్ నటిస్తోంది.

Share This Post
error: Content is protected !!