HomeUncategorizedపశు సంవర్థక పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలు

పశు సంవర్థక పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలు

భారత్ సమాచార్, విద్యా ;

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను రెండేళ్ల పశుసంవర్ధక పాలిటెక్నిక్‌ కోర్సులలో రెండేళ్ల డిప్లొమా ఇన్ యానిమల్ హస్బెండరీ కోర్సులో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు కచ్చితంగా పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జులై 22వ తేదీలోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

కోర్సు వ్యవధి రెండేళ్ల ఉంటుంది. అభ్యర్థులకు మొత్తంగా 990 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అందులో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో 330 సీట్లు, ప్రభుత్వ అనుబంధ (ప్రవేటు) పాలిటెక్నిక్ కళాశాలల్లో 660 సీట్లు అందుబాటులో ఉన్నాయి.దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పదో తరగతిలో సాధించిన మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. అభ్యర్థుల వయోపరిమితి 31-08-2024 నాటికి 15 మరియు 22 సంవత్సరాల మధ్య ఉండాలి. విద్యా విధానం ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. జనరల్, బీసీ కేటగిరీల అభ్యర్థులు రూ.880 అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.440 చెల్లిస్తే సరిపోతుంది.

అభ్యర్థులకు ముఖ్య తేదీలు…
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 08-07-2024.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22-07-2024.

మరికొన్ని వార్తా విశేషాలు…

భారత ప్రభుత్వ సాఫ్ట్ వేర్ కోర్సులు…

RELATED ARTICLES

Most Popular

Recent Comments