భారత్ సమాచార్, సినీ టాక్స్ : 1990 దశకంలో బాలీవుడ్ లో సంజయ్ దత్ పేరు మార్మోగిపోయేది. సునీల్ దత్- నర్గీస్ తనయుడిగా ఆకాశన్నంటిన కీర్తితో పాటు సాజన్, ఖల్ నాయక్.. తదితర చిత్రాలతో అప్పటి యూత్ ను ‘‘నాయక్ నహీ.. ఖల్ నాయక్ నహీ..’’ అంటూ ఓ ట్రెండ్ మార్క్ సెట్ చేశాడు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమిర్ ఖాన్ ల త్రయం కంటే ముందే బాలీవుడ్ కింగ్ గా పేరుతెచ్చుకుని చక్రం తిప్పాడు. మాధురి దీక్షిత్ లాంటి ముద్దుగుమ్మలతో వెండితెరపై భారీ రొమాన్స్ చేశాడు. ఈయన లైఫ్ అలా ఆనందంగా గడుస్తున్న సమయంలోనే 1993 ముంబై పేలుళ్ల సమయంలో అక్రమంగా మారణాయుధాలు కలిగి ఉన్నాడనే ఆరోపణలతో జైలుకు కూడా వెళ్లాడు. సంజయ్ దత్ లైఫ్ లోని ఈ డ్రామానంతా కూడా ఆయన బయోపిక్ గా తెరకెక్కిన ‘సంజు’ మూవీ లో దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ చక్కగా తెరకెక్కించాడు.
ఆ సమయంలో మాజీ ఐపీఎస్ ఆఫీసర్ మీరన్ చద్దా బోర్వాంకర్ ముంబైలో కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సంజయ్ జైలు జీవితంపై తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. మీడియా అనుకున్నట్టుగా సంజయ్ దత్ కు జైలులో ఎలాంటి స్పెషల్ ట్రీట్ మెంట్ ఇవ్వలేదని తెలిపింది. మంచి ప్రవర్తన కలిగి ఉంటేనే పేరోల్ కింద రిలీజ్ అవుతాడు కాబట్టి అందరితో బాగానే ఉండేవాడని తెలిపింది. అయితే ఓ సారి ఆర్ధర్ రోడ్ జైలు నుంచి మరో చోటుకు తరలించేటప్పుడు మాత్రం ఎన్ కౌంటర్ లో హతమారుస్తామని భయపడ్డాడు. బాడీ మొత్తం చెమటలు పట్టేసి.. వెంటనే ఆయనకు జ్వరం వచ్చేసిందని తెలిపింది.
అయితే అనూహ్యంగా సంజయ్ దత్ తరలింపు విషయం మీడియాతో సహ జనానికి తెలియడంతో జైలు గేటు ముందు వందలాదిగా గుమికూడారని చెప్పింది. మొత్తానికి సంజయ్ బాగా పనిచేసేవాడని, డబ్బులు పెట్టే సిగరెట్లు కొనుక్కునేవాడని.. సత్ప్రవర్తన కారణంగానే బెయిల్ పై బయటకు వచ్చాడని వివరించింది.