July 28, 2025 8:20 am

Email : bharathsamachar123@gmail.com

BS

Cannes: కేన్స్ వేదికగా ఆపరేషన్‌ సింధూర్‌కు ఐశ్వర్య రాయ్ మద్దతు!

భారత్ సమాచార్.నెట్: ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ (Cannes Film Festival) అట్టహాసంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. మే 13న ప్రారంభమైన ఈ వేడుక ఈ నెల 24 వరకు జరగనుంది. ఇప్పటికే పలువురు ఇండియన్ ఫిలిం స్టార్స్ (Indian Film Stars) కేన్స్ 2025లో సందడి చేశారు. తాజాగా ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న బాలీవుడ్ బ్యూటీ (Bollywood Beauty) ఐశ్వర్యరాయ్ బచ్చన్ (Aishwarya Bachchan) సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌ (Center of The Attraction)గా నిలిచారు. భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా చీర కట్టులో వచ్చిన ఐశ్వర్యరాయ్ నుదుటిన సింధూరం (Sindoor)తో అందరి దృష్టిని ఆకర్షించారు.
2002లో తొలిసారిగా ఈ వేడుకలో మెరిసిన ఐశ్వర్య రాయ్.. అప్పటి నుంచి ప్రతి ఏడాది జరిగే కేన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తన ప్రత్యేకతను చాటుకుంటుూనే ఉన్నారు. ఈ ఏడాది హాఫ్ వైట్ కలర్ జరీ అంచు బెనారసీ చీర, టిష్యూ డ్రేప్, మెడలో హారాలు.. ఇలా రాయల్ లుక్‌లో రెడ్ కార్పెట్‌పై ఆమె సందడి చేశారు. అయితే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న ఐశ్వర్యపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్‌కు కేన్స్ వేదికగా ఐశ్వర్య సింధూరం ధరించి బలమైన మెసేజ్ ఇచ్చారంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
అంతేకాకుండా గత కొంత కాలంగా ఐశ్వర్యా రాయ్ ఆమె భర్త అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కేన్స్ వేదికగా చీర కట్టులో సింధూరం ధరించి వాటన్నింటికీ చెక్‌ పెట్టారు ఆమె. నుదుటిపై సింధూరం ధరించడం భర్త పట్ల ఉన్న ప్రేమకు, నిబద్ధతకు, భక్తికి ప్రతీక అని కోట్లాది మంది భారతీయుల నమ్మకం. తాజాగా కేన్స్‌కు సింధూరంతో హాజరైన ఐశ్వర్యా రాయ్ తన భర్త పట్ల ఉన్న ప్రేమను ప్రపంచానికి తెలిపారని.. విడాకుల రూమర్స్‌కు చెక్ పెట్టారని నెట్టిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Share This Post
error: Content is protected !!