July 28, 2025 11:10 pm

Email : bharathsamachar123@gmail.com

BS

Aishwarya Rai: భగవద్గీత శోక్లంతో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెరిన ఐశ్వర్యరాయ్ 

భారత్ సమాచార్.నెట్: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ (Cannes Film Festival) అట్టహాసంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలకు బాలీవుడ్ బ్యూటీ (Bollywood Beauty) ఐశ్వర్యరాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan) కూడా హాజరయ్యారు. మొదటి రోజు హాప్ వైట్ శారీలో భారతీయత ఉట్టిపడేలా రాయల్ లుక్‌లో రెడ్ కార్పెట్‌పై సందడి చేసిన ఐశ్వర్యరాయ్ రెండోరోజూ అందరి దృష్టిని ఆకర్షించారు. మోడ్రన్ దుస్తులు ధరించినప్పటికీ భారతీయ సంస్కృతి సంప్రదాయలకు విలువనిచ్చారు.
భగవద్గీత శ్లోకాలతో (Bhagavad Gita Shloka) ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రెస్‌ను ఐశ్వర్య ధరించారు. సిల్వర్‌ కలర్‌ బనారసీ బ్రోకెడ్‌ కేప్‌పై ‘భగవద్గీత’లోని ‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన’ అనే శ్లోకాన్ని సంస్కృతం (Sanskrit)లో ఎంబ్రాయిడరీ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రముఖ డిజైనర్‌ (Famous Designer) గౌరవ్‌ గుప్తా (Gaurav Gupta) సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు. ఈ మేరకు ఐశ్వర్య ఫొటోలను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.
ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు ఐశ్వర్యపై ప్రశంసలు కురిపిస్తున్నారు. భగవద్గీత గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు అంటూ ప్రశంసిస్తున్నారు. కాగా, 2002లో తొలిసారిగా ఈ వేడుకలో మెరిసిన ఐశ్వర్య రాయ్.. అప్పటి నుంచి ప్రతి ఏడాది జరిగే కేన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తన ప్రత్యేకతను చాటుకుంటుూనే ఉన్నారు. ఈ ఏడాది హాఫ్ వైట్ కలర్ జరీ అంచు బెనారసీ చీర, టిష్యూ డ్రేప్, మెడలో హారాలు.. ఇలా రాయల్ లుక్‌లో రెడ్ కార్పెట్‌పై ఆమె సందడి చేశారు.
Share This Post
error: Content is protected !!