భారత్ సమాచార్. నెట్, హైదరాబాద్: హనుమాన్’ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ వర్మ వరుసగా ప్రాజెక్టులు ప్రకటించి హైప్ క్రియేట్ చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్ట్‌లలో ఒకటైన ‘మహాకాళి’ ఇప్పటికే ఫస్ట్ లుక్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. అయితే, ఈ సినిమా బెంగాల్ సంస్కృతి ఆధారంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ బజ్ ఫిలింనగర్‌లో హల్చల్ చేస్తోంది. బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ ఖన్నా ‘మహాకాళి’లో కీలక పాత్రలో నటించనున్నారట! అయితే, ఫిలిం మేకర్స్ నుంచి గానీ, అక్షయ్ ఖన్నా నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం ఈ రూమర్ ఊపందుకుంది. అసలే ప్రశాంత్ వర్మ సినిమాలు కంటెంట్ పరంగా కొత్తగా ఉంటాయి, ఇప్పుడు అక్షయ్ ఖన్నా లాంటి విలక్షణ నటుడు జాయిన్ అవుతాడు అన్న టాక్‌తో సినీ ఫ్యాన్స్ ఎగ్జయిట్ అవుతున్నారు.
మరోవైపు, అక్షయ్ ఖన్నా ఇటీవల ‘ఛావా’లో విలన్‌గా అదరగొట్టారు. అయితే, ప్రశాంత్ వర్మ సినిమాలో విలన్ గా నటిస్తారా? లేదా మరేదైనా పవర్‌ఫుల్ రోల్ లో కనిపిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ బజ్ నిజమైతే… ‘మహాకాళి’ మరో లెవెల్‌కి వెళ్తుందని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. త్వరలో ఏదైనా అధికారిక అప్డేట్ వస్తే ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు సినీ వర్గాలు!