భారత్ సమాచార్, తెలంగాణ: నేను బ్రతికి ఉండగానే చనిపోయినట్లుగా చిత్రీకరించి నా పేరు పై ఉన్న భూమిని వేరే వాళ్ళ పేరుపై పట్టా మార్పిడి చేశారని ఎర్రం మల్లయ్య అనే వ్యక్తి మీడియాను ఆశ్రయించిన ఘటన పర్వతగిరి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మండలంలోని వడ్లకొండ గ్రామానికి చెందిన ఎర్రం మల్లయ్యకు సర్వే నె. 185/7/1 విస్తీర్ణం ఎకరం 25 గుంటల వ్యవసాయ భూమి ఉందని గతంలో తీసుకున్న క్రాప్ లోన్ కు సంబంధించిన రుణమాఫీ కాలేదని.. ఇటీవల ప్రధాని మోదీ ప్రకటించిన రైతులకు ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం డబ్బులు అందరికీ వచ్చాయి.మాకు రాలేదని స్థానిక బ్యాంకు అధికారులను, వ్యవసాయ అధికారులను సంప్రదిస్తే.. నీ పేరు పైన భూమి లేదు మీ భూమిని ఎవరికో అమ్మావు బ్యాంకులో తీసుకున్న క్రాప్ లోన్ డబ్బులు కట్టాల్సిందని బ్యాంకు అధికారులు….. వేరే వారికి పీఎం కిసాన్ డబ్బులు పడ్డాయని వ్యవసాయ అధికారులు తెలపడంతో కంగుతిన్న రైతు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసి ఆర్టీఐ చట్టం ద్వారా సమాచారం తెలుసుకొని మీడియా ముందు తన గోడు వెళ్ళబోసుకున్నాడు.