Homebreaking updates newsఒంటరిగా ఉంటేనే అది సాధ్యం.. అనన్య పాండే

ఒంటరిగా ఉంటేనే అది సాధ్యం.. అనన్య పాండే

భారత్ సమాచార్, సినీ టాక్స్ : పాపం సినిమా తారలకు ఏ కష్టాలు ఉండయనుకుంటాం. పేరుకు పేరు.. పైసలకు పైసలు వస్తాయని అందరం భావిస్తాం. కానీ వారికుండే కష్టాలు కూడా వారికుంటాయి. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అన్నట్టుగా వాళ్ల జీవితాలు కూడా ఒక్కొక్కసారి నరకప్రాయమే అవుతాయి. హీరోయిన్లకు ఎంత ఫాలోయింగ్ ఉంటుందో దానితో వచ్చే కష్టాలు కూడా బాగానే ఉంటాయి. బాడీ షేమింగ్, క్యాస్టింగ్ కౌచ్ లు, ట్రోలింగ్ లు వారిని చాలా బాధపెడుతాయి. సెలబ్రిటీ హోదా రావడమే కాదు దాని వెనక ఎంతో కష్టమూ, శ్రమ కూడా  ఉంటుందనే విషయం అందరికి తెలిసిందే. అలాంటిదే బాలీవుడ్ భామ అనన్య పాండేకు కూడా ఉండే ఆవేదన..

కొన్ని సమయాల్లో తాను చాలా అభద్రతగా ఫీలైపోతుంటానని చెపుతోంది బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండే..ఈ ఏడాది డ్రీమ్ గర్ల్-2 తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ బ్యూటీ బాలీవుడ్ జనాలను బాగానే అలరిస్తోంది. ఓపెన్ గా మాట్లాడే అనన్య తన స్వీయానుభవాలను ఓ ఇంటర్వ్యూలో సినీ ప్రేమికులతో పంచుకుంది.

బాడీ షేమింగ్, నెగిటివిటీ వల్ల తాను ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని, ఆ నెగిటివిటీ వల్ల నా జీవితంపై ఇప్పటికీ అభద్రతతోనే ఉన్నానని చెప్పింది. కొందరు చేసే ట్రోల్స్ విపరీతంగా బాధపెడుతాయని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే వాటన్నంటికీ దూరంగా ఉండాలనుకుంటున్నానని, అందుకే ఒంటరి జీవితాన్ని గడుపుతానని అంటోంది. ‘‘నా మనసు చెప్పే మాట వింటూ నా గురించి మాత్రమే నేను ఆలోచిస్తుంటా. సోషల్ మీడియా కూడా ప్రతీ ఒక్కరిపై ప్రభావం కూడా చూపుతోంది. నాపై ప్రభావం చూపే వాటిని అన్ ఫాలో లేదా మ్యూట్ చేస్తా..’’ నని తన ఆవేదనను వెల్లగక్కింది. తాజాగా ఈ సుందరాంగి ‘‘కాల్ మీ బే’’ మూవీ తో ఓటీటీల్లోకి అడుగుపెట్టనుంది. ‘‘ఖో గయే హమ్ కహా’, ‘కంట్రోల్’, ‘శంకరా’ సినిమాల షూటింగ్ లతో బిజీ బిజీగా గడుపుతోంది ఈ అమ్మడు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments