Homemain slidesనిన్న జయంతి వైభవం.. నేడు విగ్రహం ధ్వంసం

నిన్న జయంతి వైభవం.. నేడు విగ్రహం ధ్వంసం

భారత్ సమాచార్, మెదక్: ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను నిన్న యావత్ దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలు, అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం ఆయన చేసిన త్యాగం చిరస్మరణీయం అని యువతీ యువకులు, ప్రజాసంఘాల నాయకులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు పెద్దఎత్తున సంబరాలు చేసుకున్నారు. కొన్నిచోట్ల ర్యాలీలతో హోరెత్తించారు. మరికొన్ని చోట్ల వినూత్న కార్యక్రమాలతోపాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కొన్ని చోట్ల అన్నదానాలు, రక్తదాన శిబిరాలు తదితర సేవా కార్యక్రమాలు చేపట్టి అంబేద్కర్ స్ఫూర్తిని ముందుకెళ్లాలని నాయకులు పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు అని, నిరుపేదల సంక్షేమం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన నాయకుడని అంబేద్కర్ సేవలను నిన్న ఎంతోమంది నాయకులు కొనియాడారు. కానీ నేడు మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని ఆర్.వెంకటాపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేయడం కలకలం రేపుతోంది.

దుండగులను కఠినంగా శిక్షించాలి:
రామయంపేట్ మండలంలో ఆర్.వెంకటాపూర్ గ్రామంలో ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. దుండగులను వెంటనే గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మాల ఐక్యవేదిక నాయకులు, దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. దళితుల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీయాలని కుట్ర చేసే వారిని చట్టం ప్రకారం కఠినంగా శిక్షించాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. అధికారులు వెంటనే స్పందించి నిందితులను గుర్తించి అరెస్టు చేసి ఎస్టీ, ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని తెలంగాణ రాష్ట్ర మాల ఐక్యవేదిక అధ్యక్షులు కుంట విశ్వనాధ్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మూడు శ్రీకాంత్, మెదక్ జిల్లా అధ్యక్షులు అనుముల రాజయ్య, అక్కన్నపేట్ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

 

 

 

మరిన్ని కథనాలు:

నారీ న్యాయం గ్యారంటీ…

RELATED ARTICLES

Most Popular

Recent Comments