భారత్ సమాచార్.నెట్, న్యూఢిల్లీ: పహల్గామ్‌లో పర్యాటకులను చంపిన ఉగ్రవాదులను భారత భద్రతా దళాలు మట్టుబెట్టాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా లోక్‌సభలో తెలిపారు. ఆపరేషన్ సింధూర్‌పై లోక్‌సభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. టూరిస్టులను ఉగ్రవాదులు కిరాతకంగా హత్యచేశారని, వారి కుటుంబాల ముందే పర్యాటకులను దారుణంగా చంపారన్నారు. మతం పేరు అడిగి మరీ చంపడం హేయమని పేర్కొన్నారు. పహల్గామ్ ప్రతీకారాన్ని ఆయన పార్లమెంటులో ప్రస్తావించారు. ఆపరేషన్ మహాదేవ్‌లో భాగంగా ముగ్గురు ఉగ్రవాదులను బద్రతా బలగాలు మట్టుబెట్టాయని స్పష్టం చేశారు. ఈ నెల 22న సెన్సార్ల ద్వారా ఉగ్రవాదుల కదలికలను గుర్తించినట్లు తెలిపారు.
ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన వారిని అరెస్ట్ చేశాం:
బైసరస్, లిడ్వస్‌లో ఒకే రకమైన ఆయుధాలను ఉగ్రవాదులు వాడినట్లు భద్రతా దళాలు గుర్తించినట్లు స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్‌తో ఉగ్ర శిబిరాలను మట్టిలో కలిపేసి ప్రతీకారం తీర్చుకున్నామని, ఉగ్రదాడి జరిగిన రోజునే జమ్ముూకశ్మీర్ భద్రతపై సమీక్షించానని ఆయన చెప్పారు. పహల్గామ్ దాడి ఉగ్రవాదులను హతమార్చిన ఆర్మీ, సీఆర్‌పీఎఫ్, జమ్ము పోలీసులకు అమిత్ షా అభినందనలు తెలిపారు. ఈ నెల 22న శాటిలైట్ ఫోన్ సిగ్నల్ ద్వారా ఉగ్రవాదుల ఆచూకీ తెలుసుకుని ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చినవారిని కూడా అరెస్ట్ చేసినట్లు అమిత్ షా పార్లమెంటులో స్పష్టం చేశారు. పర్యాటకులను చంపిన ఉగ్రవాదులను భారత బలగాలు అంతమొందించామని చెప్పగానే విపక్షాలు ఆనందం వ్యక్తం చేస్తాయని అనుకున్నాను. కానీ, విపక్షాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయని అమిత్‌షా ధ్వజమెత్తారు.
మరిన్ని కథనాలు:
Amit Shah: మన సంస్కృతిని అర్థం చేసుకోవడానికి విదేశీ భాషలు సరిపోవు: అమిత్ షా