August 9, 2025 10:39 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

Amul: భారత్-పాక్ ఉద్రిక్తతల వేళ.. దేశభక్తిని చాటుతున్న అమూల్ కార్టూన్ 

భారత్ సమాచార్.నెట్: భారత్-పాక్ (India-Pak) మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఎదురుకాల్పులు, వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam terror attack)లో టూరిస్టులను బలిగొన్న ముష్కరులను.. ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) పేరిట భారత్ సైన్యం (Indian Army) పీవోకే, పాకిస్థాన్ ఉగ్రస్థవరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఆపరేషన్ సింధూర్ 2.o ఇంకా కొనసాగుతున్న వేళ అమూల్ తన కార్టూన్‌ను షేర్ చేసి ప్రజల హృదయాలను గెలుచుకుంది.
దేశభక్తిని చాటుతూ, భారత సైనిక అధికారులకు వందనం చేస్తున్నట్లుగా ఉన్న ఈ కార్టూన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు నేపథ్యంలో ఈ కార్టూన్‌ను అమూల్ రూపొందించింది. అమూల్ సంస్థ తన అధికారిక ఎక్స్ ఖాతాలో.. “#Amul Topical: The India-Pakistan conflict” (అమూల్ టాపిక్: భారత-పాకిస్థాన్ ఘర్షణ) అనే వ్యాఖ్యతో ఒక డూడుల్‌ను పంచుకుంది. ఈ డూడుల్‌లో “Send them pakking” (వారిని ప్యాక్ చేసి పంపండి) అని ఆసక్తికరంగా రాసి ఉంది. అలాగే “Amul proudly Indian” (అమూల్ గర్వించదగ్గ ఇండియన్) అనే నినాదం కూడా ఆకట్టుకుంటోంది.
అలాగే ఈ డూడుల్‌లో అమూల్ గర్ల్ ‘ఆపరేషన్ సింధూర్’ గురించి విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రితో కలిసి ప్రపంచానికి వివరించిన ఇద్దరు మహిళా అధికారులు.. ఇండియన్ ఆర్మీ సిగ్నల్ కార్ప్స్‌కు చెందిన కల్నల్ సోఫియా ఖురేషి, హెలికాప్టర్ పైలట్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌లకు వందనం చేస్తున్నట్లుగా చిత్రీకరించారు. పోడియంల ముందు నిలబడి ఉన్న ఈ మహిళా అధికారులకు అమూల్ గర్ల్ సెల్యూట్ చేస్తున్న దృశ్యం అనేకమంది భారతీయులను ఆకట్టుకుంటోంది. మరోవైపు అమూల్ ప్రకటనకు సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది.
Share This Post