July 28, 2025 5:35 pm

Email : bharathsamachar123@gmail.com

BS

Sumanth: ప్రేక్షకులను మెప్పిస్తున్న సుమంత్ “అనగనగా” చిత్రం

భారత్ సమాచార్.నెట్: టాలీవుడ్‌ (Tollywood) నటుడు (Actor) సుమంత్ (Sumanth) లీడ్ ‌రోల్‌లో నటించిన చిత్రం “అనగనగా” (Anaganaga). ఇటీవల ఓటీటీ (OTT)లోకి నేరుగా రిలీజ్ అయిన ఈ చిత్రం పాజిటివ్ రెస్పాన్స్ (Positive Response) సొంతం చేసుకుంటోంది. సన్నీ సంజయ్ (Sunny Sanjay) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఎమోషనల్‌గా సాగే ఈ కథనానికి ఆడియెన్స్ కనెక్ట్ కావడంతో ఓటిటీలో హిట్‌గా నిలిచింది. అంతే కాదు ఈ సినిమాతో సుమంత్ యాక్టింగ్‌ ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది.

నిజాయితీతో నిండిన కథనం.. సుమంత్‌ సహా ఇతర సహాయ నటీనటులతో కలిసి భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. అనగనగా చిత్రం.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని మూవీ టీం సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ.. ఓ పోస్టర్ కూడా విడుదల చేసింది. కొత్తదనాన్ని ఎప్పుడూ ఆవిష్కరించడంలో ముందుండే సుమంత్‌ ఈ సినిమాతో పక్కా కథతో ప్రేక్షకులను మంత్రముగ్ధులు చేస్తున్నాడు.

థియేటర్లో విడుదల అయితే కమర్షియల్‌గా ఎంత వరకూ సక్కెస్ అయ్యేదో గానీ.. ఓటీటీలో మాత్రం చిన్న పెద్ద తేడా లేకుండా ప్రశంసలను దక్కించుకుంటోంది అనగనగా చిత్రం. ఇంటిల్లిపాది హాయిగా చూసుకునేలా ఉందంటూ ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రంలో కాజల్‌ చౌదరి హీరోయిన్‌గా నటించగా.. మాస్టర్ విహర్ష్‌, అవసరాల శ్రీనివాస్‌, అనుహాసన్‌, రాకేశ్‌ రాచకొండ ముఖ్య పాత్రల్లో కనిపించారు. చందు రవి సంగీతం అందించారు.

Share This Post
error: Content is protected !!