భారత్ సమాచార్, తెలంగాణ: ధరణి పోర్టల్ వల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఆ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం ధరణి కమిటీని ఏర్పాటు చేసింది. సమస్యలపై కమిటీ స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ధరణిలో మొత్తం 119 తప్పలు ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించింది. స్పెషల్ డ్రైవ్ చేపట్టిన తర్వాత 76 తప్పులను పరిష్కరించాల్సి ఉందని ధరణి కమిటీ పేర్కొంది. స్పెషల్ డ్రైవ్ చేపట్టడంతో లక్ష దరఖాస్తులు, పెండింగ్ అప్లికేషన్లపై సమీక్ష నిర్వహించింది.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ధరణి దరఖాస్తులు పరిష్కారం కాక ధరణి పోర్టల్, కలెక్టర్ల లాగిన్‌లో కుప్పలు తెప్పలుగా పెండింగ్‌లో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ధరణి దరఖాస్తుల పరిష్కారంపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. నిపుణులతో ఓ ప్రత్యేక కమిటీని వేశారు. కమిటీ సూచనల మేరకు ధరణి స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. 2.45 లక్షల పెండింగ్ దరఖాస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిని పరిశీలించి అప్రూవ్, లేదా రిజెక్ట్ చేసేందుకు సంబంధిత నివేదికలు సిద్ధం చేశారు. త్వరలో వీటిని పరిష్కరిస్తామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. మార్చి 16న లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ రావడంతో ధరణి దరఖాస్తుల పరిశీలన, పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను కలెక్టర్లు ఆపేశారు. ఈ క్రమంలో శనివారం కమిటీ సమావేశం కానుంది.
ధరణిలో నెలకొన్న సమస్యలను జూన్ 4వ తేదీలోపు పరిష్కరించాలని కమిటీ టార్గెట్ పెట్టుకుంది. ఆ తర్వాత ధరణి పోర్టల్ వల్ల ఏ సమస్య రావొద్దని కమిటీకి తెలంగాణ ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది. దాంతో తప్పులను సరిదిద్దే పనిలో కమిటీ నిమగ్నమైంది.
మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి