భారత్ సమాచార్.నెట్, ఏపీ: వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. తనపై నమోదైన కేసులు కొట్టేయాలని పోసాని ఏపీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పోసాని క్వాష్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. విశాఖ, చిత్తూరు జిల్లాల్లో నమోదైన కేసుల్లో ఆయనపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను మార్చి 10కి వాయిదా వేసింది.
ఏపీ సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో.. పోసాని కృష్ణమురళిపై.. ఏపీ వ్యాప్తంగా 17పైగా వివిధ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అయితే, అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి పోసానిని ఏపీ పోలీసులు ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు.రాజంపేట జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానిపై పీటీ వారెంట్లు జారీ కావడంతో పల్నాడు జిల్లా నరసరావుపేట నుంచి గుంటూరు.. అటు నుంచి కర్నూల్ సెంట్రల్ జైలుకు రిమాండ్‌పై తరలించారు పోలీసులు.
ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణ మురళికి ఊరట
RELATED ARTICLES