HomeUncategorizedఏపీ లాసెట్‌ కౌన్సిలింగ్ షెడ్యూల్

ఏపీ లాసెట్‌ కౌన్సిలింగ్ షెడ్యూల్

భారత్ సమాచార్, విద్య ;

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడేళ్లు, ఐదేళ్ళ ఎల్‌ఎల్‌బి (లా)కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన లాసెట్- 2024 కౌన్సిలింగ్ షెడ్యూల్‌‌ తాజాగా విడుదల అయింది. అక్టోబర్‌ 16 వ తేదీనుంచి 20వ తేదీ లోపు కౌన్సెలింగ్, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అధికారులు సూచించారు. అక్టోబర్‌ 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల ద్వారా కళాశాలలు ఎంపిక చేసుకోటానికి అవకాశం కల్పిస్తారు. 26వ తేదీన వెబ్ ఆప్షన్ లో మార్పులు చేసుకోడానికి అవకాశం ఇస్తారు. 28వ తేదీన విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు . లాసెట్‌లో సీట్లు పొందిన విద్యా ర్థులు 29, 30 తేదీల్లో ఆయా కళాశాలల్లో చేరాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

గతేడాది చూస్తే ఏపీలో లాసెట్ కౌన్సెలింగ్ నవంబర్‌లో ప్రారంభమైంది. ఈసారి అక్టోబర్‌లోనే నిర్వహిస్తున్నారు. ఏపీ లాసెట్‌ను 19,224 మంది అభ్యర్థులు రాశారు. అందులో 17,117 మంది (89.04 శాతం) అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో రెండేళ్ల పీజీ కోర్స్ లో 99.51 శాతం, మూడేళ్ల ఎల్ఎల్‌బీ కోర్స్ లో 89.74 శాతం, ఐదేళ్ల ఎల్ఎల్‌బీ కోర్స్ లో 80.06 శాతం ఉతీర్ణత సాధించారు. ఎంట్రెన్స్ లో పాస్ అయిన వారితో పాటు మేనేజ్ మెంట్ కోటాలో చేరాలనుకునే చాలా మంది అభ్యర్థులు… కౌన్సెలింగ్ తేదీల కోసం ఎదురుచూస్తున్నారు. లాసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ప్రకటించాలంటే ఆయా కాలేజీలకు బార్ కౌన్సెల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఏపీలో కొన్నికాలేజీల అనుమతుల ప్రక్రియ కొనసాగడంతో షెడ్యూల్‌ విడుదలలో జాప్యం జరిగింది. రెండేళ్ల పీజీ కోర్సులో(LLM) పురుషులు 99.51 శాతం, స్త్రీలు 99.51 శాతం ఉత్తీర్ణత సాధించారు. మూడేళ్ల ఎల్ఎల్‌బీ కోర్సులో పురుషులు 91.28 శాతం, స్త్రీలు 86.26 శాతం, ఐదేళ్ల ఎల్ఎల్‌బీ కోర్సులో పురుషులు 81.91 శాతం, స్త్రీలు 78.17 శాతం ఉత్తీర్ణత సాధించారు.

మరికొన్ని వార్తా విశేషాలు...

ఇకపై లా కోర్సులు చదవాలంటే…

RELATED ARTICLES

Most Popular