HomeUncategorizedఏపీ టెట్ షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం

ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం

భారత్ సమాచార్, అమరావతి ;

నిరుద్యోగులు వెయ్యి కళ్లతో ఐదేళ్లగా ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ ని నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన చర్యలు చేపడుతోంది. మెగా డీఎస్పీకి ముందు నిర్వహించే టెట్‌ పరీక్షకు ఇప్పటికే షెడ్యూల్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ షెడ్యూల్‌ను అభ్యర్థుల సూచన మేరకు సవరించింది. ఆగస్టు 3వ తేదీ వరకు టెట్ దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 20 వరకు టెట్ పరీక్షలు నిర్వహిస్తారు. నవంబర్ 2వ తేదీన టెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు.

16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీకి సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం మరోసారి టెట్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. జులై 2న టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసినప్పటికీ అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు టెట్‌, డీఎస్సీలకు సన్నద్ధమయ్యేందుకు మరింత గడువు ఇస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో టెట్‌ షెడ్యూల్‌లో పలు మార్పులతో తాజాగా సవరించిన నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పాత నోటిఫికేషన్‌ ప్రకారం ఆగస్టు 5 నుంచి 20వరకు టెట్‌ పరీక్షలు జరగాల్సి ఉండగా వాటిని అక్టోబర్‌ 3 నుంచి 20 వరకు నిర్వహించాలని నిర్ణయించింది. డీఎస్సీలో టెట్‌కు 20శాతం వెయిటేజీ ఉన్న విషయం తెలిసిందే.

సిలబస్ ఆధారంగానే సన్నద్ధం కావాలి

ఏపీ టెట్ సిలబస్ గురించి అపోహలు వద్దని విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ సూచించారు. టెట్‌ నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులిటెన్, షెడ్యూల్, సిలబస్ వివరాలు వెబ్​సైట్​లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. ఫిబ్రవరి 2024 టెట్ సిలబస్ ఆధారంగా పరీక్షకు అభ్యర్థులు సన్నద్ధం కావాలి పేర్కొన్నారు. పాత సిలబస్ ఆన్‌లైన్‌లో ఉంచినట్లుగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, అభ్యర్థులు ఎలాంటి అపోహలు పడొద్దన్నారు. ఫిబ్రవరిలో నిర్వహించిన టెట్‌ సిలబస్‌నే ప్రస్తుత టెట్‌కు కూడా నిర్ధారించామని, అందువలన దానిని వెబ్​సైట్​లో అభ్యర్థులకు అందుబాటులో ఉంచామని అన్నారు. ఈ సిలబస్ ఆధారంగానే అభ్యర్థులు టెట్​కు సన్నద్ధం కావాలని సూచిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.

మరికొన్ని తాజా వార్తా విశేషాలు...

ఏపీలో ఇంజినీరింగ్ కాలేజీల‌ ఫీజుల వివ‌రాలు

RELATED ARTICLES

Most Popular

Recent Comments