భారత్ సమాచార్, విద్య ;
కొన్ని అనివార్య కారణాల వలన పాఠశాల, కళాశాల విద్యకు దూరమైన వారి కోసం ఏపీ ఓపెన్ స్కూల్ ఒక ప్రత్యేక అవకాశం కల్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏపీ ఓపెన్ స్కూల్‌లో 10వ తరగతి ,ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. వివిధ కారణాల వలన చదువు కొనసాగించలేని గ్రామీణ యువతీ యువకులు, స్త్రీ, పురుషులు, ప్రత్యేక అవసరాలు గల వారు ఇందులో చేరటానికి అర్హులు. ఇంటర్మిడీయట్ లో ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ, ఎంఈసీ, హె చ్‌ఈసీ, సీఈసీ గ్రూపులు అందుబాటులో ఉన్నాయి. పదవ తరగతి చదవటానికి చదువు కు దూరమైన వారు, బడి మధ్య లో మానేసి వారు, 10 వతరగతి ఫెయిల్ వారు, అర్హులు. ఇంటర్ కు పదో తరగతి కచ్చితంగా ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ఇంటర్ మధ్యలో మానేసిన అభ్యర్థులు వారు అర్హులు. పదో తరగతి చదవాలనుకునే వారికి 14 ఏళ్ల వయస్సు నిండి ఉండాలి. 15 ఏళ్లు పూర్తయిన వారు ఇంటర్ లో చేరేందుకు అర్హులు. గరిష్ట వయోపరిమితి లేదు. ఈ కోర్సుల్లో చేరటానికి ఆన్ లైన్ ద్వారా అప్లే చేసుకోవాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది 31.07.2024. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 27.08.2024. రూ.200 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపునకు చివరితేది: 28.08.2024. మరిన్ని వివరాలకు అధికారిక వైబ్ సైట్ వెబ్‌సైట్: https://apopenschool.ap.gov.in ను బ్రౌజ్ చేయాలని అధికారులు సూచించారు.