భారత్ సమాచార్, ఆరోగ్యం ;
ప్రతి ఏడాది కూడా భారతదేశంలో లక్షలాది మంది ప్రాణాంతక క్షయ వ్యాధిబారిన పడుతున్నారు. సరైన సమయంలో సరైన చిక్సిత్స అందక వేల మంది మరణిస్తున్నారు. ఈ క్షయ వ్యాధి మరణాలను నిర్మాలించటం కోసం ప్రభుత్వం వయోజనుల క్షయ టీకా కార్యక్రమం రూపొందించింది. ఈ కార్యక్రమంపై పౌరులకు, వైద్య ఆరోగ్య సిబ్బందికి కొన్ని ముఖ్యమైన మార్గదర్శకాలు జారీ చేసింది అవేంటో ఇక్కడ ఒకసారి చూద్దాం.
వయోజనుల క్షయ టీకా (బీసీజీ) (Adult BCG Vaccination)వేసుకోవటానికి కావాల్సిన ఆరు ప్రమాణాలు
1.గత ఐదు సంవత్సరాల లొ టీబీ వ్యాధి వచ్చి తగ్గిపోయిన వ్యక్తులు.
2.పద్దెనిమిది ఏళ్ల వయస్సు నిండిన వ్యక్తులు.
3. (స్మోకింగ్) సిగరెట్ పొగ తాగేవారు.
4. షుగర్ వ్యాది ఉన్న వారు.
5.శరీర ద్రవ్యరాశి సూచిక (BMI)18 కన్నా తక్కువ ఉండేవారు.
6. టీబీ రోగులతో సన్నిహిత సంబంధాలు ఉన్నవారు.
టీకా తీసుకోవాలనుకున్న వ్యక్తులు ఈ ఆరు ప్రమాణాలను ఒక సారి కచ్చితంగా పరిశీలించాలి. టీకా తీసుకోవాలనుకునే వ్యక్తులు కచ్చితంగా సమ్మతి పత్రం మీద సంతకం చేయాల్సి ఉంటుంది. టీకా తీసుకున్న చోట బొబ్బ కానీ మచ్చ కానీ ఏర్పడుతుంది దీని వల్ల భయపడాల్సిన అవసరం లేదు.
వీరు టీకా తీసుకోకూడదు…
1. ప్రస్తుతం టీబీ వ్యాధి నివారణ కోసం మందులు వాడుతున్న వాళ్లు.
2. గర్భవతులు, పాలు ఇచ్చే తల్లులు.
3. హెబ్ఐవీ, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు.
4. కిడ్నీ, లివర్ ట్రాన్స్ ప్లాంట్ చేసుకొని మందులు వాడుతున్న వాళ్లు.
7. బ్లడ్ డొనేషన్ చేసిన వ్యక్తి 3 నెలలు వరకు టీకా వేసుకోకూడదు.
8. 18 ఏళ్లు దాటని వ్యక్తులు టీకా తీసుకోటానికి అనర్హులు.