Homebreaking updates newsమేడారం జాతరకు బస్సులు రెడీ.. మరి ఉచిత టికెట్ ?

మేడారం జాతరకు బస్సులు రెడీ.. మరి ఉచిత టికెట్ ?

భారత్ సమాచార్, హైదరాబాద్ : మేడారం జాతర వస్తుందంటే చాలు తెలంగాణ అంతటా పండుగ వాతావరణం నెలకొంటుందన్న విషయం అందరికి తెలిసిందే. కోట్లాది భక్తులు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకునేందుకు వెళ్తుంటారు. జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, ఛత్తీస్ గఢ్, ఒడిషా, మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి గిరిజన భక్తులు, ఇతర భక్తులు తండోప తండాలుగా తరలివస్తుంటారు. జాతర జరిగే నాలుగు రోజుల్లో భక్తుల రద్దీ చాలా అధికంగా ఉంటుంది కాబట్టి కొందరు భక్తులు రెండు నెలల ముందుగానే మేడారం వెళ్లి అమ్మలను దర్శించుకుంటారు. ఈ సంఖ్య కూడా లక్షల్లోనే ఉండడం గమనార్హం. పైగా జాతర రోజుల్లో అయితే ఇసుక వేస్తే రాలనంత జనాన్ని మనం అక్కడ చూడవచ్చు. ఈ ఏడాది కూడా ముడుపులు చెల్లించుకునే భక్తుల సంఖ్య కోట్లల్లోనే ఉంటుంది అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ సంఖ్యలో జాతరకు విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు.

మేడారం జాతర ఈ ఏడాది ఫిబ్రవరి 21వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రభుత్వం జాతర ఏర్పాట్లను చేస్తోంది. అయితే ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులను నడుపనున్నట్టు వరంగల్ ఆర్టీసీ ఆర్ఎం శ్రీలత తెలిపారు. డిసెంబర్ 17 నుంచి స్పెషల్ బస్సులు ప్రారంభిస్తున్నట్టు చెప్పారు.

ప్రతీ బుధ, ఆదివారం సెలవు దినాల్లో హన్మకొండ బస్టాండ్ నుంచి ప్రతీ 45 నిమిషాలకు ఒక బస్సు నడుపనున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీని బట్టి మరిన్ని బస్సులు పెంచుతామని చెప్పారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అందిస్తోంది. కానీ మేడారం స్పెషల్ బస్సుల్లో ఆ ఏర్పాటు చేసిందా లేదా.. అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఎందుకంటే మేడారం జాతరకు మాములుగానే లక్షల్లో మహిళలు బస్సు లో వెళ్తారు. మరి అంతమందికి ఫ్రీ ఇవ్వడం ప్రభుత్వానికి సవాల్ గా మారనుంది. దీనిపై తొందరలోనే క్లారిటీ ఇవ్వాలని మహిళలు కోరుతున్నారు.

మరికొన్ని కథనాలు…

జీరో కరెంటు బిల్లు రావటం లేదా..?

RELATED ARTICLES

Most Popular

Recent Comments