Homebreaking updates newsనువ్వు స్త్రీవాదివేనా? త్రిషపై ట్రోలింగ్

నువ్వు స్త్రీవాదివేనా? త్రిషపై ట్రోలింగ్

భారత్ సమాచార్, సినీ టాక్స్ : మొన్నటిదాక సౌత్ ఇండస్ట్రీలో త్రిషపై సీనియర్ నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన కామెంట్స్ పై పెద్ద ఎత్తున రచ్చ జరిగిన విషయం అందరికి తెలిసిందే. ఈ విషయంలో  ఎంతో మంది సినీ పెద్దలు, సినీ ప్రేక్షకులు, నెటిజన్లు త్రిషకు సపోర్ట్ గా కూడా నిలిచారు. లియో మూవీలో ‘‘త్రిషను రేప్ చేసే అవకాశం వస్తే బాగుండు’’ అన్న మన్సూర్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో సినీ జనాలు, తమిళ నడిగర్ సంఘం కూడా మన్సూర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అతడిపై మహిళా కమిషన్ చర్యలకు కూడా రెడీ అయ్యింది. ఇంతలోనే క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదం అలా సద్దుమణిగింది.

తాజాగా సందీప్ రెడ్డి, రణబీర్ కపూర్ కాంబినేషనల్ లో వచ్చిన ‘యానిమల్’ మూవీ రిలీజై పాన్ ఇండియా లెవల్లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న విషయం సినీ ప్రేమికులకి తెలిసిందే. ఈ మూవీ విడుదలైన మూడు రోజుల్లోనే రూ.360 కోట్ల దాక వసూలు చేసి రూ.500 కోట్ల క్లబ్ లోకి వేగంగా చేరబోతోంది. దీంతో ఈ మూవీపై పలువురు ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు. ఈ సినిమా చూసిన త్రిష..‘‘వన్ వర్డ్.. కల్ట్.. పప్పా’’ అంటూ ట్వీట్టర్ వేదికగా తన అభిప్రాయాలను పంచుకుంది.  దీంతో ఈ స్మైలింగ్ బ్యూటీపై నెట్టింట దారుణమైన ట్రోలింగ్ నడుస్తోంది. మొన్నటిదాక మన్సూర్ అలీఖాన్ తనపై చేసిన కామెంట్స్ ను తీవ్రంగా ఖండించిన త్రిష.. ఇప్పుడు ఇలాంటి అడల్ట్ సినిమాకే కల్ట్ ఫిల్మ్ గా రివ్యూ ఇవ్వడంపై కొందరు నెటిజన్లు, మహిళలు దుమ్మెత్తిపోస్తున్నారు. ‘‘నువ్వు స్త్రీవాదివేనా? ’’ అని ఆన్ లైన్ వేదికగా మండిపడుతున్నారు. ఈ చిత్రంలో అసభ్యకరమైన కామెంట్స్ లేవా? అని త్రషను ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా రష్మికను రణబీర్ టార్చర్ చేసే సన్నివేశాలను ఏ విధంగా పరిగణించాలని కామెంట్స్ పెడుతున్నారు. దీంతో ఈ ట్రోలింగ్ తట్టుకోలేని క్రేజీ సౌత్ హీరోయిన్ త్రిష తను చేసిన పోస్ట్  ను ఇంటర్ నెట్ నుంచి రిమూవ్ చేసింది.

మరికొన్ని కథనాలు...

RELATED ARTICLES

Most Popular

Recent Comments