HomeUncategorizedమెగా డీఎస్సీకి ఏర్పాట్లు..ఖాళీలు ఎన్నో తెలుసా?

మెగా డీఎస్సీకి ఏర్పాట్లు..ఖాళీలు ఎన్నో తెలుసా?

భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మెగా డీఎస్సీ వేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి మరి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల తర్వాత ఇక ఆ ప్రభుత్వమే అధికారంలోకి రావడంతో మెగా డీఎస్సీకి ఇవ్వటానికి ఏర్పాట్లు చేస్తున్నది. దీనికోసం అధికారుల నుంచి మొత్తం వివరాలు తెప్పించుకుంది. దాని ప్రకారం దాదాపు 9,800 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. మూడున్నర నెలల కింద గత బీఆర్ఎస్ ప్రభుత్వం 5,089 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే భారీ సంఖ్యలో ఖాళీలు ఉన్నా.. తక్కువ పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వడంపై నిరుద్యోగులు నిరసనలు సైతం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ వేస్తామని కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు హామీ ఇచ్చింది. ఈ మేరకు గవర్నర్ తమిళిసై వచ్చే 6 నెలల్లో మెగా డీఎస్సీ ద్వారా పోస్టులు భర్తీ అధికారికంగా కూడా ప్రకటించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన డీఎస్సీ నోటిఫికేషన్ కు దాదాపు 1.77లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఎన్నికల కోడ్ రావడంతో పరీక్షలు ఆగిపోయాయి. ఇప్పుడు ఆ నోటిఫికేషన్ రద్దు చేస్తే మరిన్ని సమస్యలు వస్తాయని అధికారులు చెపుతున్నారు. అందుకే అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని కాంగ్రస్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది జూన్ నాటి కల్లా పోస్టులను భర్తీ చేస్తే విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని నిపుణులు, నిరుద్యోగులు సూచిస్తున్నారు. అలాగే కోర్టు కేసులకు, పదోన్నతులకు డీఎస్సీని ముడిపెడితే ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో తీవ్ర ఆలస్యం అవుతుందని, అలా చేయవద్దని వారు సూచిస్తున్నారు.

మరికొన్ని కథనాలు…

మూడోసారి గ్రూప్-2 వాయిదా.. మళ్లీ ఎప్పుడో?

RELATED ARTICLES

Most Popular

Recent Comments