July 28, 2025 11:52 am

Email : bharathsamachar123@gmail.com

BS

Ashok Gajapathi raju: గోవా గవర్నర్‌గా నియమించడంపై స్పందించిన అశోక్ గజపతిరాజు

భారత్ సమాచార్.నెట్: మూడు రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త గవర్నర్ల నియామకాలను ఆమోదం తెలిపారు. ఇందుకు సంబంధించి రాష్ట్రపతి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. హర్యానా గవర్నర్‌గా ఆషిమ్ కుమార్ ఘోష్, లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవిందర్ గప్తాను, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అశోక్ గజపతిరాజుని గోవా గవర్నర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
గోవా గవర్నర్‌గా తనను నియమించడం పట్ల అశోక్ గజపతిరాజు స్పందించారు. అవకాశాల కోసం తానేప్పుడు పరిగెత్తలేదని ఆయన పేర్కొన్నారు. అవకాశాలు వచ్చిప్పుడు బాధ్యతగా స్వీకరించానని చెప్పారు. గవర్నర్‌గా తన పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు సిఫార్సు చేయడం ఆనందంగా ఉందన్నారు. విజయనగరంలో నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి దక్కడంపై పార్టీ శ్రేణులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే విజయనగరానికి చెందిన అశోక్ గజపతిరాజు టీడీపీలో అత్యంత సీనియర్ నేతల్లో ఒకరు. కొన్ని ఏళ్లపాటు జిల్లా రాజకీయాల్లో ఆక్ష్న కీలకంగా వ్యవహరించారు. అశోక్ గజపతిరాజ్ రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా పని చేశారు. 1951 జూన్ 26వ తేదీన జన్మించిన ఆయన.. గ్వాలియర్‌లోని సింధియా, హైదరాబాద్‌ పబ్లిక్ స్కూల్‌, విశాఖపట్నంలోని ప్రభుత్వ కృష్ణా కళాశాలలో చదువుకున్నారు. పుట్టింది రాజవంశంలో అయినా సామ్యవాద భావాలను చిన్నప్పటి నుంచి పుణికి పుచ్చుకున్నారు. విద్యార్థి దశలో ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు అశోక్ గజపతిరాజ్.
Share This Post
error: Content is protected !!