July 28, 2025 12:28 pm

Email : bharathsamachar123@gmail.com

BS

Ashwini Vaishnaw: భవిష్యత్తులో ఇక్కడి నుంచే మెట్రో కోచ్‌లు అశ్వీని వైష్ణవ్

భారత్ సమాచార్.నెట్, వరంగల్: వరంగల్ జిల్లా ప్రజల చిరకాల వాంఛను సాకారం చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకి దక్కుతందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. శనివారం కాజీపేట్‌ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. అనంతరం రైల్వే కోచ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీని పరిశీలించారు. నిర్మాణ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా అశ్వినీ వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ.. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కాజీపేట్ రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌‌ని నిర్మిస్తున్నామని తెలిపారు. దాదాపు 500 కోట్లతో ఈ పరిశ్రమ ఏర్పాటు అవుతుందని… 2026లో ఈ పరిశ్రమం అందుబాటులోకి రానుందని చెప్పారు. కాజీపేటలో రైల్వే కోచ్‌ల ఉత్పత్తి ప్రారంభం అవుతుందని చెప్పారు. ఈ యూనిట్ ఒక మెగా ఫ్యాక్టరీగా రూపుదిద్దుకుంటుదని పేర్కొన్నారు. కాజీపేట రైల్వే కోచ్‌ యూనిట్ నుంచే రైల్వే కోచ్‌లు, ఇంజిన్లలు సహా భవిష్యత్‌లో మెట్రో కోచ్‌లు కూడా తయారవువుతాయన్నారు. ఇక్కడి నుంచే త్వరలో 150 లోకోమోటివ్‌లు ఎగుమతి అవుతాయన్నారు.
 ఇక యూనిట్ పనులను పర్యవేక్షించేందుకు వచ్చిన అశ్వినీ వైష్ణవ్‌కు వరంగల్ జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ 40 ఏళ్ల పోరాటమని.. ఇక్కడి ప్రజల కళను మోదీ ప్రభుత్వం సాకారం చేస్తుందన్నారు. ఈ యూనిట్ ద్వారా 3 వేల మందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు. రాష్ట్రంలోని 40 రైల్వే స్టేషన్ల్లో అభివృద్ధి జరుగుతోందని.. ఇందులో వరంగల్ స్టేషన్ కూడా ఉందన్నారు. ఇక వరంగల్‌కు ఎయిర్‌పోర్టు రావాల్సి ఉందని.. ఇందుకోసం గత పాలకులను భూముల కోసం అడిగామని.. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వాన్ని అడుగుతున్నామని కిషన్ రెడ్డి చెప్పారు.
Share This Post
error: Content is protected !!